జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మకమైన ముందడుగు అని ఆర్మీ చీఫ్ ముకుంద్ నరవనే అన్నారు. ఇది జమ్మూ కశ్మీర్ ను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చిందని తెలిపారు. గత ఏడాది ఆగస్ట్ లో జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని ప్రభుత్వం రద్దు చేసింది. ఆర్టికల్ 370 రద్దు వల్ల భారత్ తో పొరుగు దేశమైన పాకిస్థాన్ పరోక్ష యుద్ధానికి అడ్డంకి ఏర్పడిందన్నారు. 72వ ఆర్మీ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నరవనే ఈ వ్యాఖ్యలు చేశారు.
టెర్రరిజం పట్ల సైనిక దళాలకు ఎలాంటి సానుభూతి లేదని..టెర్రరిజాన్ని ప్రోత్సహించే వారికి చెక్ పెట్టడానికి తమ దగ్గర చాలా అవకాశాలున్నాయని…వాటిని ప్రయోగించడానికి ఏ మాత్రం సంకోచించమని ఆర్మీ చీఫ్ తెలిపారు.