పలాస ప్రాంతానికి చెందిన ముగ్గురు జవాన్లు స్వామి వివేకానంద సేవా సమితి పేర ఆకలితో ఉన్నవారి కడుపు నింపేందుకు ఫుడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ బ్యాంక్ రోజూ దాదాపు 100 మంది ఆకలి తీరుస్తోంది. ఆ ముగ్గురు ఆర్మీ జవాన్లలో కిరణ్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో, ధర్మ అస్సాంలో ,బన్నీ మీరట్ లోని BSF లో ఉద్యోగాలు చేస్తున్నారు.
ఒకసారి ఓ రైల్వే స్టేషన్ లో ఓ బిచ్చగాడు తిండికోసం పడే తిప్పలను కళ్లారా చూశాక… ఆకలితో బాధపడే వారికి ఏదైనా సహాయం చేయాలనే ఆలోచనతో ఈ ఫుడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేశారట…. పలాస పరిసర ప్రాంతం నుండి దాదాపు 600 మంది యువకులు వీరితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వీరు ఓ బ్లడ్ బ్యాంక్ ను కూడా నిర్వహిస్తున్నారు.