ఎముకలు కొరికే చలిని తట్టుకోవడం.. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన పౌరులను రక్షించడం.. ఏదైనా సరే దేశం పట్ల భారత ఆర్మీ చూపే అంకితభావం ప్రశంసనీయం. ఆమధ్య తుపానులో మోకాళ్ల లోతు మంచులో దృఢంగా నిలబడిన ఆర్మీ జవాన్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తాజాగా మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఆర్మీ జవాన్లు గడ్డకట్టే చలి వాతావరణంలోనూ వాలీబాల్ ఆడుతూ కనిపించారు. విపరీతంగా మంచు కురుస్తున్నా కూడా సరదాగా కాసేపు గడిపారు. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఈ వీడియోను షేర్ చేశారు.
రెండు జట్లుగా విడిపోయిన జవాన్లు మంచులో వాలీబాల్ ఆడారు. ఈ వీడియోకు వేలల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఉత్తమ వింటర్ గేమ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
గడ్డకట్టే చలిలోనూ సరదాగా ఆడుతున్న సైనికుల ఫిట్‌నెస్ కు నెటిజన్స్ ఫిదా అయిపోయారు. కొంతమంది అయితే.. వారి అంకితభావానికి జైహింద్ అంటూ కామెంట్లు పెట్టారు. ఎంతోమందికి ఇది ప్రేరణ అని కొనియాడారు.
The best ‘Winter Games.’
Our Jawans. 🇮🇳 pic.twitter.com/8Jwk4CEy2W— Awanish Sharan (@AwanishSharan) January 13, 2022
Advertisements