
సైన్యంలో సగటు వయసు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని, కార్గిల్ రివ్యూ కమిటీ సైతం ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించిందని రక్షణ శాఖ సైనిక వ్యవహారాల విభాగం కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ వెల్లడించారు. దీంతో సైన్యంలో సంస్కరణలు తీసుకు రావాలని అనుకున్నామన్నారు. కానీ ఈ సంస్కరణ చాలా కాలంగా పెండింగ్ లో ఉందన్నారు.
అన్నారు. సియాచిన్, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న సాధారణ సైనికులతో సమానంగా వారికి అలవెన్స్ లను అందించనున్నట్టు లెఫ్ట్ నెంట్ జనరల్ అనిల్ పూరి వెల్లడించారు. సర్వీసు నిబంధనల్లో ఎలాంటి వివక్షత ఉండబోదని ఆయన అన్నారు. ఈ నూతన పథకం పనితీరును అంచనా వేసేందుకు గాను తొలుత కేవలం 46 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు తెలిపారు.
రాబోయే నాలుగు నుంచి ఐదేండ్లలో మొత్తం 50 నుంచి 60వేల మంది అగ్ని వీరులను రిక్రూట్ చేసుకోనున్నట్టు ఆర్మీ ప్రకటించారు. ప్రస్తుతం ప్రకటించిన 46000 ఉద్యోగాల సంఖ్యతోనే ఇది ఆగిపోదని, సమీప భవిష్యత్ లో దాన్ని 1లక్షా 25 వేలకు పెంచనున్నట్టు ఆయన చెప్పారు. .
అగ్నివీర్ బ్యాచ్ నెంబర్ 1కు రిజిస్ట్రేషన్లు జూలై 24 నుంచి ప్రారంభం కానున్నట్టు వెల్లడించారు. మొదటి బ్యాచ్ డిసెంబర్ లో ఎన్ రోల్ అవుతుందని చెప్పారు. వారికి డిసెంబర్ 30 నుంచి శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. దేశ సేవలో అమరుడైన అగ్నివీరుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందిస్తామని చెప్పారు.
Advertisements
ఇక ఆందోళనకారులకు అధికారులు షాక్ ఇచ్చారు. విధ్వంసానికి పాల్పడేవారిని సైన్యంలో చేర్చుకునే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఆర్మీలో క్రమశిక్షణారాహిత్యానికి చోటు ఉండదని ఆయన తేల్చి చెప్పారు. క్రమ శిక్షణ అనే పునాది మీద ఆర్మీ ఏర్పాటైందని ఆయన అన్నారు.