ఓ కామాంధుడి పైశాచికత్వానికి ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోగా.. చివరికి ఆ కామమే అతడ్ని కూడా కాటేసింది. దీంతో వారిని కన్నవారికి కడుపుకోతే మిగిలింది. సంచలనాన్ని సృష్టించిన ఈ సంఘటన కర్ణాటక లో చోటుచేసుకుంది. కడలూరు గ్రామానికి చెందిన దినేశ్ అనే యువకుడికి కొన్ని రోజుల క్రితమే కోణనూరు సమీపంలో ఉన్న రామన కొప్ప గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది.
అయితే అమ్మాయి మేజర్ అవ్వడానికి ఇంకా ఆర్నెళ్ల సమయం ఉండడంతో.. ఆ తరువాతే పెళ్లి చేద్దామని వధూవరుల కుంటుంబాలు నిర్ణయించుకున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. అయితే వరుడికి తనకు కాబోయే భార్యతో పెళ్లికి ముందే లైగింక సంబంధం పెట్టుకోవాలన్న కోరిక కల్గింది. దీంతో అతను ఆమెను బలవంతం చేశాడు. కాని ఆమె ఒప్పుకోక పోవడంతో ఓ రోజు ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వచ్చి.. ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ విషయం కాస్త.. ఆ యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో..వారు అతని పై ఆగ్రహించారు. దీంతో వధువుపై మరింత పగ పెంచుకున్న ఆ దుర్మార్గుడు మళ్ళీ దారుణానికి పాల్పడ్డాడు. మరో సారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లి.. ఆమెను నిర్దాక్షిణ్యంగా గొంతు నులిమి చంపేశాడు. ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అయితే పరువు పోతుందన్న భయంతో వధువు తల్లిదండ్రులు..తన కూతురు ఉరి వేసుకొని చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాని ఆ కామాంధుడి పాపం పడింది. అనుమానం వచ్చిన పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం విచారణ చేపట్టగా..నిందితుడి బండారం బయట పడింది. దీంతో అతను పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో.. విషాన్ని మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చేర్చగా..చికిత్స తీసుకుంటూ మరణించాడు.