హిమాచల్ ప్రదేశ్ లో ఓ బస్సుకు కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. షిల్లాయ్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పిన బస్సు.. లోయలోకి దూసుకెళ్లింది. ముందున్న చక్రాలతో పాటు సగానికి పైగా లోయలోకి ఒరిగిపోయింది.
డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులోని 22 మంది సురక్షితంగా బయటపడ్డారు. వారంతా బయటకు వచ్చేదాకా బస్సును నిలువరించాడు డ్రైవర్. చివరకు ప్రయాణికులు అతడ్ని కాపాడారు.
డ్రైవర్ చాకచక్యంతోనే తాము ప్రాణాలతో మిగిలామని తెలిపారు ప్రయాణికులు. లేకపోతే బస్సు లోయలోకి పడిపోయేదని చెప్పారు.