2022-23లో దాదాపు 50 ప్రభుత్వ వెబ్‌సైట్‌లు హ్యాకింగ్‌కు గురయ్యాయని కేంద్ర కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు. 2020లో 59 ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాక్ అయినట్టు పేర్కొన్నారు.
2021లో 42 వెబ్ సైట్లు, 2022లో 50 ప్రభుత్వ వెబ్‌సైట్‌ల హ్యాక్ అయ్యాయని చెప్పారు. దీంతో పాటు డేటా ఉల్లంఘనకు సంబంధించి 2020లో ఆరు, 2021లో ఏడు, 2022లో ఎనిమిది ఘటనలు జరిగాయని ఆయన తెలిపారు.
2020లో 2,83,581, 2021లో 4,32,057, 2022లో 3,24,620 హానికరమైన స్కామ్‌లను గుర్తించి నిరోధించినట్లు సీఈఆర్‌టీ- ఇన్ తెలిపినట్ట ఆయన అన్నారు. ఈ సైబర్ అటాక్ లు దేశీయంగా, విదేశాల నుంచి జరిగాయన్నారు.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఐఎన్), సర్వీస్ ప్రొవైడర్లు, రెగ్యులేటర్లు న్యాయ అధికారులతో కలిసి సైబర్ దాడులకు వ్యతిరేకంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.