వలస కూలీలలతో తెలంగాణ నుండి ఉత్తరప్రదేశ్ వెళ్తున్న లారీ నిర్మల్ జిల్లా సమీపంలో బోల్తా కొట్టింది. నేషనల్ హైవేపై వెళ్తున్న ఈ లారీలో 70మంది వరకు వలస కూలీలు ఘోరక్ పూర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. రోడ్డుకు ఆనుకోని ఉన్న రేలింగ్ ను ఢీకొట్టడంతో లారీ బోల్తా పడింది.
ఈ ఘటనలో 9 మందికి తీవ్ర గాయాలవ్వగా, 2 పరిస్థితి విషమంగా ఉంది. మరో 20మంది గాయాలయ్యాయి. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను వెంటనే సమీపంలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో గల ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో గాయపడ్డ వారు కోలుకుంటుండగా… క్షేమంగా ఉన్న వారిని యూపీకి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.