పెరూలో వింత ఘటన చోటు చేసుకుంది. జూలియో సీజర్ బెర్మెజో అనే యువకుడు 800 ఏండ్ల క్రితం నాటి మమ్మీతో ప్రేమలో పడ్డాడు. దాన్ని ఏకంగా తన ఇంటికి తీసుకు వచ్చి భద్రంగా పెట్టుకున్నాడు. దాన్ని ఎంత గానో ప్రేమిస్తున్నానని చెబుతున్నారు.
సుమారు ముప్పై ఏండ్లుగా ఆ మమ్మీ తనతోనే ఉంటోందని చెబుతున్నాడు. ఒక ఐసో థర్మల్ బ్యాగ్ లో పెట్టి దాన్ని చాలా భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నానన్నాడు. ఆ విషయం ఒకరి నుంచి మరొకరి చివరకు ఆ దేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు తెలిసింది.
దీంతో ఆ యువకున్ని పోలీసులు అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి ఆ మమ్మీని స్వాధీనం చేసుకున్నారు. బెర్మోజో కుటుంబ సభ్యులు ఫుడ్, సరుకుల రవాణా చేస్తుండేవాళ్లు. సుమారు 30 ఏండ్ల క్రితం అతని తండ్రి జువానిటా అనే మమ్మీని తనతో తీసుకొచ్చి ఇంట్లో దాచుకున్నాడు.
ఆ తర్వాత దాన్ని వారసత్వంగా బెర్మెజో చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఆ మమ్మీని బెర్మెజో అమ్మకానికి పెట్టాడు. డీల్ నిమిత్తం దాన్ని తన స్నేహితులతో కలిసి పునో నగరంలోని ఓ పార్కుకు తీసుకొచ్చాడు. అక్కడే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు బెర్మెజోను అరెస్టు చేశారు. ఆ మమ్మీని పెరూలోని మ్యూజియానికి తరలించాడు.