పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని రోజులుగా జరుగుతోన్న ఆందోళనలు..ఆస్తుల విధ్వంసంలో రైల్వే శాఖకు భారీ నష్టం జరిగింది. రైల్వే శాఖకు మొత్తం రూ. 90 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో వున్న ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే 80 శాతం రైల్వే ఆస్తులు ధ్వంసమైనట్లు గుర్తించారు. మొత్తం 72.19 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు భావిస్తున్నారు. సౌత్ ఈస్ట్రన్ రైల్వే కు రూ. 12.75 కోట్ల నష్టం వాటిల్లగా, నార్త్ ఈస్ట్రన్ రైల్వేకి 2.98 కోట్ల నష్టం వాటిల్లిందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఆయన తెలిపారు.
విధ్వంసాలకు పాల్పడిన వారిపై రైల్వే పోలీసు పోలీస్ ఫోర్స్ 85 కేసులు నమోదు చేసింది. 12 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి.రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన వారిని సీసీ టీవీలు, వీడియోల ద్వారా గుర్తించామని, వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, వారిని కఠినంగా శిక్షిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.