రేపు ఉదయం 11 గంటల నుంచి రోజంతా సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. అక్కడ పలు సంక్షేమ కార్యాక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు.. మోతే రోడ్డులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
హెలికాఫ్టర్ ద్వారా జగిత్యాలకు చేరుకుంటున్న కేసీఆర్..ముందు టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తరువాత 110 కోట్లతో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారు.అదే విధంగా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొని.. జిల్లా అధికారులు, ప్రజాప్రతనిధులతో నూతన కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
తరువాత ప్రత్యేక బస్సు ద్వారా మోతే రోడ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు చేరుకొని అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ భారీ బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి ,కొప్పుల ఈశ్వర్ లతో పాటు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. చొప్పదండి వేములవాడ, కోరుట్ల ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఈ సభ అనంతరం కేసీఆర్
హైదరాబాద్ కు బయల్దేరుతారు.
అయితే ఈ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యవేక్షిస్తున్నారు. ఇక సిరిసిల్ల, వేముల వాడ, కరీంనగర్, నిర్మల్, నిజాంబాద్ లతో పాటు జగిత్యాలకు చుట్టూ ఉన్న నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో జనాలను సభకు తరలిస్తున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో.. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.