కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఇంటిపై జరిగిన దాడి తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడ్డ వ్యక్తి ఎవరన్న కోణంలో విచారణ మొదలుపెట్టారు.
దాడికి సంబంధించి రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఎట్టకేలకు నిందితున్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
నిందితున్ని సిద్ధార్థ్.. ఉత్తరప్రదేశ్ కు చెందిన వాడని పోలీసులు వెల్లడించారు. యూపీకి చెందిన వ్యక్తి వీహెచ్ ఇంటిపై దాడి చేయడానికి గల కారణమేమిటన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదే విషయంపై పోలీసులు నిందితుడి నుంచి వివరాలు రాబట్టే యత్నం చేస్తున్నట్లుగా సమాచారం. అయితే.. నిందితుడు సిద్ధార్ధ్.. మద్యం మత్తులో చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. నిజానిజాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.