ఢిల్లీలో పట్టుబడిన ముగ్గురు ఐ.ఎస్.ఐ.ఎస్ ఉగ్రవాదులు దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడించారు. పోలీస్, ఆర్మీ క్యాంపులపై దాడులు చేయమని సూచించినట్టు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య గురువారం కొద్ది సేపు కాల్పుల అనంతరం వారిని అరెస్ట్ చేశారు. ఆయుధాలను, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు శుక్రవారం వారిని విచారించగా దేశవ్యాప్తంగా ఆరెస్సెస్, హిందూ నేతలను టార్గెట్ చేయమని తమకు ఆదేశించినట్టు చెప్పారు.