భారత్ కు చెందిన ఆర్టిఫిషియల్ టియర్స్ కంటి చుక్కుల మందుపై అమెరికా నిషేధం విధించింది. తమిళనాడుకు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ సంస్థ దీన్ని తయారు చేస్తోంది. ఆ కంటి చుక్కల మందుతో పలువురికి కంటి చూపు మందగించింది. దీంతో పాటు ఒకరు మరణించారు.
దీంతో ఆర్టిఫిషియల్ టియర్స్ పై అమెరికా నిషేధం విధించింది. ఆ చుక్కల మందు వల్ల అమెరికాలో సుమారు 55 మందికి పలు రకాల నేత్ర సంబంధం సమస్యలు వచ్చినట్టు తెలిసింది. దీంతో తమిళనాడుకు చెందిన ఔషద నియంత్రణ శాఖ గ్లోబల్ ఫార్మా కంపెనీలో తనిఖీలు చేపట్టింది.
ఆ చుక్కల మందులో ఔషద నిరోధక బ్యాక్టీరియా ఉండటంతో 55 కేసులు నమోదైనట్టు అమెరికాకు చెందిన సీడీసీ పేర్కొంది. ఆ చుక్కల మందు ఉపయోగించిన వారిలో కొందరు కంటి చూపును కూడా కోల్పోయారు. ఓ వ్యక్తి రక్తస్త్రావంతో మృతిచెందాడు.
దీంతో తమిళనాడు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తనిఖీ చేపట్టారు. అమెరికా పంపించిన కంటి చుక్కల మందు శ్యాంపిల్స్ ను సేకరించామని అధికారులు తెలిపారు. దీని తయారీకి ఉపయోగించిన ముడి సరకులను కూడా సేకరించామని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై ప్రాథమిక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించామన్నారు. కంపెనీలో కంటి చుక్కల మందు తయారీని నిలిపివేయాలని ఆదేశించినట్టు అధికారులు తెలిపారు. ఆర్టిఫిషియల్ టియర్స్ తయారు చేసేందుకు కంపెనీకి సరియైన లైసెన్స్ ఉన్నట్టు చెప్పారు.