బర్త్ డే సందర్భంగా ప్రధాని మోడీకి సామాన్యుల నుంచి సెలెబ్రిటీల దాకా అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అందరిలా చెబితే రొటీన్ అయిపోతుందని అనుకుందో ఏమో.. ఒడిశాకు చెందిన ఆర్టిస్ట్ ప్రియాంక అద్భుతమైన మోడీ చిత్రాన్ని రూపొందించింది.
బియ్యం, పప్పులు,అటుకులు లాంటి ఆహార ధాన్యాలతో మోడీ పోర్ట్రెయిట్ తయారు చేసింది ప్రియాంక. ఒడిశా సంప్రదాయ డిజైన్ లో దీన్ని రూపొందించినట్లు చెప్పింది. రాష్ట్ర ప్రజల తరఫున ఈవిధంగా ప్రధానికి బర్త్ డే విషెస్ చెబుతున్నట్లు వివరించింది. అన్నట్లు.. దీన్ని తయారు చేయడానికి ప్రియాంకకు 25 గంటల సమయం పట్టింది.