అరుంధతి” అనుష్క నట విశ్వరూపం చూపించిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత అనుష్క ఇమేజ్ మరో రేంజ్ కి వెళ్ళింది. ఈ సినిమాలో ఆమె నటన, కొన్ని సన్నివేశాల్లో ఆమె చూపించిన హావభావాలు ఇప్పటికీ ప్రేక్షకుల కళ్ళల్లో అలాగే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత ఆమెతో సినిమా చేయడానికి అగ్ర హీరోలు కూడా ఎదురు చూసారు అంటే ఆమెకు ఏ రేంజ్ లో సినిమా పేరు తెచ్చిపెట్టింది అనేది అర్ధం చేసుకోవచ్చు.
Also Read:ఇన్ స్టా” కు రష్యా షాక్
శ్యాం ప్రసాద రెడ్డి నిర్మాణ సారధ్యంలో, కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్నో సంచలనాలకు వేదిక అయింది. ఇక ఈ సినిమా కథ ఎంపిక కాస్త భిన్నంగా జరిగింది. అంజి సినిమా ఘోర ఫ్లాప్ తర్వాత శ్యాం ప్రసాద రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ తరుణంలో గద్వాల్ కోటకు వెళ్ళడం అక్కడ జరిగిన ఒక వ్యవహారం తెలుసుకోవడం దాన్ని సినిమాగా మలచడం అన్నీ జరిగాయి.
అంజి సినిమా గ్రాఫిక్స్ కు అవార్డు రావడంతో ఆ టీం నే ఈ సినిమాకు కూడా తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో జేజెమ్మ పాత్రకు ముందు అనుష్క ని కాకుండా మరో హీరోయిన్ ని అనుకున్నారు. రాజసం ఉట్టిపడే, మంచి ఎత్తుగా ఉండే కథానాయిక అవసరం ఉంది. ఆమె కోసం చాలానే కష్టపడ్డారు. మమతా మోహన్ దాస్ అయితే బావుంటుందన్న అభిప్రాయంతో ఆమె వద్దకు వెళ్ళగా శ్యాం సినిమా అంటే ఏళ్ళకు ఏళ్ళు పడుతుందని చెప్పడంతో ఆమె వద్దని వెనక్కు తగ్గారు. దీనితో అనుష్క ని సెలెక్ట్ చేసి సినిమా మొదలుపెట్టారు. అప్పుడు ఆమె నాగార్జున తో సూపర్ సినిమా రవితేజా సరసన విక్రమార్కుడు సినిమా చేస్తున్నారు. ఇక ఆమె వేరే వాళ్ళ సలహా తీసుకుని ఈ సినిమా చేసారు.
Also Read:వీఆర్‌ఏ దారుణ హత్య