దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా అరుంధతి. ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం అనే చెప్పాలి. ఈ సినిమాలో నటించిన నటులు కూడా సంచలనం సృష్టించారు.

అనుష్క ఒక్కరే కాకుండా… సోను సూద్ తో పాటు షియాజీ షిండే వంటి వాళ్ళు కీలక పాత్రలు పోషించారు.
Also Read: బ్రాహ్మణులు ఉల్లి తినకపోవడానికి కారణం ఏంటీ…?
ఇక ఈ సినిమాలో… అనుష్క చిన్న నాటి పాత్రలో నటించింది దివ్య నగేష్. ఈ సినిమాలో ఆమె పాత్ర తక్కువ సేపే ఉన్నా సరే ఆ పాత్ర మాత్రం బాగా హిట్ అయింది. హావభావాలకు తెలుగు ఫాన్స్ ఫిదా అయిపోయారు. ఆ పాపకు ఆ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఆమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. కేరళకు చెందిన దివ్య… మలయాళ సినిమాల్లో బాల నటిగా మంచి పాత్రలు పోషించింది.
150 పైగా ప్రకటనలు కూడా చేసి బిజీ అయింది. బాల నటి అయిన తర్వాత ఆమె పెద్దగా సినిమాలు చేయలేదు. ఇక మలయాళ సినిమాల్లో కొన్నింటి లో హీరోయిన్ గాకుడ చేసింది. తెలుగులో నేను నాన్న అబద్దం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆమెకు తమిళంలో కూడా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం బాల, శంకర్ వంటి దర్శకులతో కలిసి ముందుకు వెళ్తుంది. ఇక ఆమె ఇటీవల చేసిన ఫోటో షూట్ కు మంచి స్పందన వచ్చింది.
Also Read:జగన్ తో పేర్ని నాని భేటీ…సినిమా టికెట్ల ధరల పై చర్చ