తెలంగాణలో కొనుగోలు కేంద్రాల దగ్గర మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు ఎంపీ అరవింద్. ఢిల్లీలో మీడియాతో మట్లాడిన ఆయన.. కేసీఆర్, కేటీఆర్ పై మండిపడ్డారు. బ్లాక్ మార్కెటింగ్ తో సంబంధం లేకపోతే కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యాసంగి పంటకు బోనస్ వస్తోందని… తెలంగాణలో మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
భైంసా అల్లర్ల తర్వాత బీజేపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఈ విషయాన్ని హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు అరవింద్. నలుగురిపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అండతో ఎంఐఎం నేతల ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు పని చేస్తున్నారని అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు అరవింద్.