ప్రతిరోజూ యోగా, ప్రాణాయామం చేసేలా అందరూ సంకల్పం తీసుకోవాలని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సూచించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మందితో కలిసి ఆయన యోగాసనాలు వేశారు.
ఆయనతో పాటు ఢిల్లీ యోగశాలకు చెందిన సభ్యులు, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఇతర మంత్రులు, ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రజల సౌకర్యం కోసం తమ ప్రభుత్వం ఉచిత యోగా తరగతులను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రజలు రోజూ యోగాను చేయాలని, తద్వారా ఆరోగ్యంగా ఉంటారని ఆయన సూచించారు.