కేసీఆర్,కేటీఆర్ పై బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి. రాజకీయాల్లో నిజామాబాద్ ఎపీం అరవింద్ ఓ కుసంస్కారి అని అన్నారు. అరవింద్ తాగే నీళ్లు కేసీఆర్ వే..నడిచే రోడ్డు కేసీఆర్ వేసిందే అన్నారు.
అరవింద్ అడ్డగాడిదలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ దావోస్ వెళ్లి ఏం చేశారో అరవింద్ కు తెలియదా అని ప్రశ్నించారు. ఐటీ గురించి అరవింద్ లాంటి లూటీ గాళ్లకు ఏం తెలుసని ఎద్దేవా చేశారు. అబద్దాలు మాట్లాడితే అరవింద్ నాలుక చీరేస్తామని ఆయన హెచ్చరించారు. అరవింద్.. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పై చర్చకు వస్తావా..?ఎక్కడైనా చర్చకు నేను సిద్ధమని జీవన్ రెడ్డి సవాల్ విసిరారు.
కరెంట్ లేదంటున్న అరవింద్.. ఓ సారి కరెంట్ తీగలను పట్టుకోవాలన్నారు. ఈటల రాజేందర్ అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు తరుముతారన్నారు. నిజామాబాద్ అభివృద్ధి పై ఈటలతో కూడా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నందిపేటలో సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం బీజేపీ కుట్ర అని ఆరోపించారు. బిల్లులు రాలేదనే కారణంతో వాళ్లు ఆందోళన చేయలేదని..ఏదో టెన్షన్ లో అలా చేశానని ఆ సర్పంచ్ తర్వాత చెప్పారని జీవన్ రెడ్డి వెల్లడించారు.
ఎంపీగా అరవింద్ నిజామాబాద్ కు ఓ చిల్లిగవ్వ కూడా తేలేదని విమర్శించారు. పసుపు బోర్డు తెస్తా అని అరవింద్ మోసం చేశారన్నారు. అరవింద్ ఓ అబద్దాల కోరని అన్నారు. కేసీఆర్ కుటుంబం పై విమర్శలు తప్ప అరవింద్ కు ఏదీ చేత కాదన్నారు. ఇక ఎంపీగా అరవింద్ ను ఎందుకు ఎన్నుకున్నామని నిజామాబాద్ ప్రజలు బాధ పడుతున్నారన్నారు ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం. అరవింద్ కేసీఆర్ కుటుంబ సభ్యుల కాలి గోటికి కూడా సరిపోరని అన్నారు.