చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆర్య వైశ్య చైతన్య పోరాట సమితి నాయకులు నిరసనకు దిగారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి తాము ఓటు వేయబోమని పేర్కొన్నారు.
ఈ మేరకు ప్ల కార్డులతో సమితి నాయకులు నిరసన తెలిపారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని గతంలో టీఆర్ఎస్ సర్కార్ ప్రకటించిందన్నారు.
ప్రకటన చేసి ఇప్పటికి నాలుగేండ్లవుతోందని, కానీ ఇప్పటి వరకు కార్పొరేషన్ ను టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి, టీఆర్ఎస్ ఇప్పుడు ఆ మాట తప్పిందన్నారు. అందుకే ఆ పార్టీకి తాము ఓటు వేయబోమని స్పష్టం చేశారు.