శనివారం ఉదయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలవనుండగా నేతలు ఇప్పుడు దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ శుక్రవారం సాయంత్రం దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. కేజ్రీవాల్ సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లోని హనుమాన్ దేవాలయంలో, మనోజ్ తివారీ సౌత్ ఢిల్లీలోని కల్కాజీ దేవాలయానికి వెళ్లారు.
తాను హనుమాన్ భక్తుడినని..రెగ్యులర్ గా దేవాలయానికి వెళ్తుంటానని…భజనలు చేస్తుంటానని ఓ టెలివిజన్ చానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ లో విమర్శలు చేశారు. ” ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఇబ్బందుల్లో ఉంది..అందుకే కేజ్రీవాల్ కు ”సంకట్ మోచన్” గుర్తొచ్చిందని ట్వీట్ చేశారు. దీన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరికి ట్యాగ్ చేశారు.
”సంకట్ మోచన్” అంటే భక్తులకు ఏదైనా సమస్య వస్తే హనుమాన్ చాలీసా వంటివి చదువుతూ ఆ కష్టాల నుంచి తనను గట్టెక్కించమని కోరడం.