దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం కూడా పెరిగాయి. దీనిపై సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి పలు రాష్ట్రాల్లో త్వరలో రాబోయే ఎన్నికలకు షెడ్యూల్ ను వెంటనే ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని ఆమె కోరారు.
‘ పలు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే ఎన్నికలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాను. అలా చేస్తే ఇంధన ధరలు డిరెగ్యూలేషన్ నుంచి రెగ్యులేషన్ విధానంలోకి వెళ్లిపోతాయి’ అని ఆమె ట్వీట్ చేశారు.
ఈసీ షెడ్యూల్ ప్రకటిస్తే పెరిగిన ధరల నుంచి భారతీయులకు ఉపశమనం లభిస్తుందని ఆమె అన్నారు. ఎన్నికలు ఈక్వల్ట్ ఇంధన ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇంధన ధరల పెరుగుదలకు అసెంబ్లీ ఎన్నికల ముగింపునకు సంబంధం ఉందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఖండించారు.
పెట్రోల్, డీజిల్ పెరుగుదలకు ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణమంటూ ఆమె స్పష్టతనిచ్చారు. యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరల్లో పెరుగుదలతోనే వాటి ధరలు పెరిగినట్టు వివరణ ఇచ్చారు.