తన నియోజకవర్గంలో ఇరుకురోడ్ల పరిస్థితిపై ఆ ఎంపీ మాట్లాడరు…తన నియోజకవర్గంలో పాఠశాల ల పరిస్థితిపై ఏరోజు మాట్లాడరు ఆ ఎంపీ…36 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్న ఏరోజు నోరు విప్పరు ఆ ఎంపీ… MRO పై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఆ ఎంపీ…తనను వరుసగా గెలిపిస్తూ వస్తున్న నియోజకవర్గం అభివృద్ధి అమడదురంలో ఉన్న ఏరోజు నోరు విప్పి మాట్లాడలేదు ఆ ఎంపీ… కానీ విద్వేషాలు రెచ్చగొట్టే విషయాల్లో మాత్రం చాలా స్పీడ్ గా స్పందిస్తారు, ప్రజలకు ఉపయోగం లేకపోయినా తనకు మాత్రం ఓట్లు వస్తాయని యువత ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటారు ఆ ఎంపీ…ఇంతకు ఆ ఎంపీ ఎవరు అనుకుంటున్నారు వివరాల్లోకి వెళ్దాం….
పాతబస్తీకి అభివృద్ధి అంటే ఏందో తెలియదు, స్కూల్స్ పరిస్థితి మరి ఘోరంగా ఉంటుంది, ఇక బస్సు సర్వీసులు సగం ప్రాంతాల్లోకి వెళ్లవు, ఉపాధి అవకాశాలు లేక చాలామంది ముస్లిం యువత బ్రతుకుదేరువుకు బయటదేశాలకు వెళ్తుంటారు, ఆర్టిక ఇబ్బందులతో అమ్మాయిలను దుబాయ్ షేక్ లకు అమ్ముకునే కుటుంబాలు కూడా పాతబస్తీలో ఉన్నాయి, ఇలాంటి సమస్యలపై ఏనాడు నోరువిప్పని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలపై మాత్రం ఆఘమేఘాలపై స్పందిస్తారు. అయోధ్య పై సుప్రీం ఇచ్చిన తీర్పును యావత్తు భారత దేశం స్వాగతించింది..ముస్లిం మతపెద్దలు సైతం సుప్రీం తీర్పు శిరోధార్యం అన్నారు.. సున్ని వక్ఫ్ బోర్డు కూడా తీర్పును స్వాగతించింది కానీ తన నియోజకవర్గం సమస్యలు ఏనాడు పట్టించుకోని అసద్ కు మాత్రం సుప్రీం తీర్పు నచ్చలేదట .. వరుసగా సుప్రీం తీర్పుపై కామెంట్స్ చేస్తూ ఉద్రిక్తతలు పెంచుతున్నారు….
రాష్ట్రం లో ఏ సమస్య ఉన్న నాకు సంబంధం లేదు అన్నట్లు ఉంటారు అసదుద్దీన్ ఓవైసీ… రైతులు చనిపోయిన ఆయన ఏరోజు మాట్లాడారు, తనను వరుసగా గెలిపిస్తూ వస్తున్న ప్రజలకు ఏ సమస్య వచ్చినా మాట్లాడరు. ఆర్టీసీ ఉద్యోగులు గత 36 రోజులుగా సమ్మె చేస్తున్న ఇప్పటివరకు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఇవేవీ పట్టించుకోని సదరు ఎంపీ గారు విద్వేషాలు రెచ్చగొట్టే స్టేట్మెంట్ లు ఇవ్వడం లో మాత్రం ముందుంటారు అంటున్నారు బీజేపీ నేతలు.అసదుద్దీన్ ఓవైసీ తన మనోభావాలు వెల్లడించడం లో తప్పు లేదు కానీ అదే స్పీడ్ లో రాష్ట్రంలోని సమస్యలపై స్పందిస్తే బాగుంటది అనేది విశ్లేషకుల మాట.