పశ్చిమ బెంగాల్‌లో మైనార్టీ ఓట్లను చీల్చేందుకు బీజేపీ.. హైదరాబాద్‌కు చెందిన పార్టీని తీసుకొస్తోందంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ఇచ్చారు. తనను డబ్బుతో కొనే మనిషి ఇంకా పుట్టలేదంటూ ఆయన తీవ్రంగా స్పందించారు. ఆమే చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. తమ పార్టీ( తృణమూల్ కాంగ్రెస్) నుంచి చాలా మంది నేతలు బీజేపీలోకి వెళ్తుండటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారని అసదుద్దీన్ విమర్శించారు. అందుకే ఆ నెపాన్ని తమపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మమతా బెనర్జీ చేస్తున్న వ్యాఖ్యలు.. బిహార్‌లో తమ పార్టీకి ఓట్లు వేసిన ఓటర్లను అవమానించేలా ఉన్నాయని అసదుద్దీన్ అన్నారు.
కాగా , మమతా బెనర్జీ నిన్న ఓ సభలో మాట్లాడుతూ ఎంఐఎం, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. మైనార్టీ ఓట్లు చీల్చేందుకు బీజేపీ ఎంఐఎంను అస్త్రంగా వాడుకుంటోందని ఆమె ఆరోపించారు. బిహార్‌లో చేసినట్టుగానే పశ్చిమ బెంగాల్‌లోనూ చేయాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు.