అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన సందర్భంగా ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ స్పందించారు. ఈ మేరకు ఉదయం ఆయన ఓ ట్వీట్ చేశారు. అక్కడ బాబ్రీ మసీదు ఉండేది…ఎప్పటికీ ఉంటుంది కూడా అంటూ కామెంట్ చేశారు. ట్వీట్‌తో పాటు బాబ్రీ మసీద్‌కు సంబంధించిన రెండు పురాతన చిత్రాలను కూడా జోడించారు. అందులో ఒకటి బాబ్రీ మసీదు బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఫోటో కాగా.. మరొకటి బాబ్రీ మసీదు అల్లర్లకు సంబంధించినది.
#BabriMasjid thi, hai aur rahegi inshallah #BabriZindaHai pic.twitter.com/RIhWyUjcYT
— Asaduddin Owaisi (@asadowaisi) August 5, 2020