ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలను ఉద్ధేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సర్వేకు వారణాసి కోర్టు అనుమతినిచ్చింది. దీనిపై స్పందించిన ఓవైసీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని మార్చగలిగే శక్తి ముస్లీంలకు లేదన్నారు. ముస్లీంలకు ఆ శక్తి ఉంటే.. భారత పార్లమెంట్ లో ఇంత తక్కువ ముస్లిం ప్రాతినిధ్యం ఉండేది కాదని వ్యాఖ్యానించారు.
బాబ్రీ మసీదుకు బదులు అప్పుడు ప్రభుత్వాన్ని మార్చి ఉంటే.. ఇప్పుడు జ్ఞానవాపి సమస్య తెరపైకి వచ్చేది కాదన్నారు. ఇప్పటికే ఒక మసీదును కోల్పోయామని.. మరో మసీదును కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. 1986లో మసీదును ముట్టుకోబోమని సుప్రీంకోర్టుకు చెప్పి.. మసీదును కూల్చివేశారని ఆరోపించారు అసద్.
జ్ఞానవాపి మసీదు బేస్‌మెంట్ లో సర్వే సందర్భంగా గోడలపై త్రిశూల్, స్వస్తిక్ గుర్తులు కనిపించాయి. వారి డిజైన్ శైలిని కోర్టు కమిషనర్, న్యాయవాదులు అంచనా వేశారు. మూలాల ప్రకారం.. నేలమాళిగలో మొసలి క్రాఫ్ట్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నేలమాళిగలో ఆలయ శిఖరం అవశేషాలను కనిపించడంతో సర్వేలో కూడా సమస్య ఏర్పడింది.
కోర్టు కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రా, విశాల్ సింగ్, అజయ్ ప్రతాప్ సింగ్ అన్ని పార్టీల సభ్యులతోపాటు మసీదులోకి ప్రవేశించి కమిషన్ కార్యకలాపాలు ప్రారంభించారు. కమిటీ సభ్యులు అంతా ముందుగా మసీదు పశ్చిమ గోడను చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు ఇక్కడే ఉండి.. అందులోని బేస్‌మెంట్ ను పరిశీలించారు.