కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరో సారి స్పందించారు. హిజాబ్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. ఏదో ఒకరోజు ఒక హిజాబీ దేశ ప్రధాన మంత్రి అవుతారని ఆయన ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
హిజాబ్ ధరిస్తానని ఓ ఆడపిల్ల తన తల్లిదండ్రులతో అంటుందని అన్నారు. అందుకు తన తల్లిదండ్రులు కూడా అంగీకరిస్తారని చెప్పారు. హిజాబ్ ధరించకుండా ఎవరు ఆపుతారో చూద్దామని ధైర్యం చెబుతారని ఆయన చెప్పారు. ఆడపిల్ల హిజాబ్ ధరించి వైద్యురాలు కూడా అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఓవైసీ.
హిజాబ్ ధరించిన ఓ అమ్మాయి కలెక్టర్, వ్యాపారవేత్త కూడా అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దేవుడి దయవల్ల ఏదో ఓ రోజు హిజబ్ ధరించిన మహిళే ప్రధాని కూడా అవుతారని ఆయన చెప్పారు.
తాను బతికి ఉన్నా.. లేకున్నా ముందు తరాలకు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు గుర్తుచేసుకుంటారని అన్నారు. కాగా.. దేశంలో చెలరేగుతోన్న హిజాబ్ వ్యవహారంపై పలు దేశాలు కూడా స్పందిస్తున్నాయి.