అల్లు అర్జున్ తదుపరి చిత్రం పుష్ప. సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్ ఇస్తూ… ఫ్యాన్స్ ను సంతోష పెడుతున్నారు. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని పనిచేస్తున్నప్పటికీ కరోనా వైరస్ నేపథ్యంలో ఎంతవరకు సక్సెస్ అవుతున్నారన్నది అసలు ప్రశ్న.
తాజాగా సినిమా యూనిట్ నుండి మరో అప్డేట్ అందింది. ఆస్కార్ విన్నర్ ను పుష్ప సినిమా కోసం రంగంలోకి దించారు. ఆస్కార్ విన్నర్ రిసూల్ పొకుట్టి పుష్ప కోసం పనిచేయనున్నారు. ఈ మలయాళం సౌండ్ డిజైనర్ హిందీ, మలయాళం, తమిళ్ సినిమాలకు గతంలో పనిచేయగా… ఫస్ట్ టైం తెలుగు సినిమాకు పనిచేయబోతున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంతో సినిమా రాబోతుంది.