ఏపీ రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతుందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. తిరుపతిలో అమరావతి జేఏసీ నిర్వహించిన సభ వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది అని పేర్కొన్నారు. అమరావతి నుంచి సీఎం జగన్ ఒక్క ఇటుకను కూడా తరలించలేరన్న విషయాన్ని తిరుపతి సభ చాటిచెప్పిందని ద్వజమెత్తారు.
జగన్ చెబుతున్న మూడు రాజధానులతో అభివృద్ధి అనే అంశాన్ని ప్రజలెవరూ నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడమే జగన్ ప్రభుత్వ ఓటమికి నిదర్శనమని విమర్శించారు. ఓఆర్ఆర్ పరిధిని తగ్గించడం రాష్ట్రాభివృద్ధిని కుదించడమేనని వ్యాఖ్యానించారు అశోక్ బాబు.