ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నూమా దాస్ వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు విశ్వక్ సేన్. ఇటీవలే పాగల్ సినిమాతో కూడా మరో హిట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్ అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 2న ఉదయం 11 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.
అలాగే కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో బస్సులో కూర్చుని కనిపించారు విశ్వక్. ఇక ఇందులో రుక్సర్ దిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుండగా విద్యా సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు.
Advertisements
ఇక ఈ సినిమాను ఎస్.వి.సి.సి డిజిటల్ పతాకం పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమాతో ఎలాంటి హిట్ ను విశ్వక్ అందుకుంటాడో.