విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జునకల్యాణం సినిమా కచ్చితంగా మంచి మూవీనే. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అయితే.. నిజంగా ఇది హిట్ సినిమానా అంటే మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. ఎందుకంటే కంటెంట్ పరంగా సినిమాను అందరూ హిట్ అని ఒప్పుకుంటారు. కానీ.. రెవెన్యూ పరంగా మాత్రం దీన్ని చాలామంది ఫ్లాప్ అంటారు.
ఈ సినిమాను వరల్డ్ వైడ్ 5 కోట్ల 80 లక్షల రూపాయలకు అమ్మారు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 6 కోట్ల 20 లక్షల రూపాయలు రావాలి. సినిమాకు మొదటి 5 రోజుల్లో 4 కోట్ల 40 లక్షల రూపాయలు వచ్చాయి. ఆ తర్వాత టోటల్ రన్ లో 43 లక్షల రూపాయల వరకు షేర్ రాబట్టింది.
ఓవరాల్ గా ఈ సినిమా 4 కోట్ల 83 లక్షల రూపాయల దగ్గరే ఆగిపోయింది. దీంతో బయ్యర్లకు కోటిన్నరకు పైగా నష్టం వచ్చింది. సినిమా సోలోగా రిలీజై కనీసం 2 వారాలు ఆడేలా ఉంటే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యేది. ఎందుకంటే, ఈ సినిమా కంటెంట్ అందరికీ నచ్చేసింది. కానీ.. ఆ అవకాశం లేకుండా పోయింది.
అశోకవనంలో అర్జునకల్యాణం సినిమా రిలీజైన వారం రోజులకే సర్కారువారి పాట సినిమా వచ్చింది. మహేష్ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లను క్లీన్ స్వీప్ చేసింది. భారీ ఎత్తున రిలీజైంది. దీంతో అశోకవనంలో అర్జునకల్యాణం సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.