టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు యూత్ అండ్ మాస్ ప్రేక్షకులను టార్గెట్ గా చేసుకుని సినిమాలు చేసిన విశ్వక్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయ్యేందుకు చూస్తున్నాడు.
విద్యాసాగర్ చింత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బాపినీడు, సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా కు సంబంధించి విడుదల అయినా లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
మార్చి 4వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ సరసన రుక్సార్ థిల్లోన్ హీరోయిన్ గా నటిస్తుంది.
గతంలో కృష్ణార్జున యుద్ధం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ అమ్మడు. ఇక ఈ సినిమాకు జై క్రిష్ సంగీతాన్ని అందించాడు.