‘తొలివెలుగు’ అంచనాను నిజం చేస్తూ ఆదివారం ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున వచ్చి అషురెడ్డిని ఎలిమినేట్ చేశారు. జూనియర్ సమంతాగా పిలిపించుకునే అషురెడ్డి తన నాలుగు వారాల జర్నీని ముగించుకుని బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. ఈవారం బిగ్‌బాస్ ప్రేక్షకులకు మరో పెద్ద సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్టు ప్రచారం జరిగినా నాగార్జున ఆ వివరాలేవీ బయటపెట్టలేదు. సడెన్‌గా ఈవారం ఏదోరోజు ఎవరో ఒకరు బిగ్‌బాస్ హౌస్‌లోకి రావచ్చు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఇంతకీ ఎవరా వైల్డ్ కార్డ్ ఎంట్రీ.? హాట్ టాలీవుడ్ బ్యూటీయేనా?
కుమారి 21 ఎఫ్ చిత్రంతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన హెబ్బా పటేల్ బిగ్‌హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతోందనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. తన తొలి చిత్రంతోనే హెబ్బా కుర్రాళ్ళను అబ్బా అనిపించేసింది. యువ గుండెల్లో హీట్ పుట్టించింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా.. ఆడో రకం ఈడో రకం.. 24 కిస్సెస్ లాంటి చిత్రాలతో పొగలు-సెగలు పుట్టించిన హెబ్బా పటేల్ హౌస్‌లోకి ఎంటరయిందంటే టీ.ఆర్.పీలకు రెక్కలొచ్చేసినట్టే మరి. వైల్డ్ కార్డు లిస్టులో స్ట్రాంగ్‌గా వినిపిస్తూ ఉన్న మరో పేరు శ్రద్ధాదాస్. కేవలం హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌తో ఎన్నో సినిమాల్లో మెరిసి హాట్ న్యూటీగా పేరు తెచ్చుకున్న పొడుగు కాళ్ళ సుందరి శ్రద్ధాదాస్. అప్పుడెప్పుడో అల్లరి నరేశ్ సినిమా ‘సిద్ధు ఫ్రం సికాకుళం’తో ఎంట్రీ ఇచ్చింది. తన తొలి సినిమాతోనే అందరి కళ్ళనూ తన వైపు తిప్పుకుంది ఈ హాట్ బ్యూటీ. కేవలం తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషలన్నిటితో పాటూ బాలీవుడ్‌లో కూడా తన గ్లామర్ పరిచయం చేసిన శ్రద్ధాదాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినా కూడా బిగ్‌బాస్ షో టీ.ఆర్.పీ రేటింగ్ ఎక్కడికో పోవడం ఖాయం.
లిస్టులో వినిపిస్తున్న మరో పేరు మత బోధకుడి నుంచి రాజకీయ పార్టీ స్థాపకుడిగా మారిన కే.ఏ.పాల్. గుర్తుందిగా ఇటీవలి 2019 తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో పాల్ తనదైన స్టైల్లో ఎంత వినోదాన్ని పంచిపెట్టారో? ఇంకా అస్పష్టంగా మరిన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎవ్వరూ ఊహించని ఒక కామన్ మేన్, కేరెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ, జబర్దస్త్ ఫేం గెటప్ శీను, జబర్దస్త్ నరేశ్… ఇలా కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. లిస్టులో మొదటి ముగ్గురిలోనే ఒకరు ఉండవచ్చని అందరూ చెబుతున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ…