ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్యుల దగ్గర నుంచి సినీ స్టార్స్ వరకు అందరూ రకరకాల ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ పబ్లిక్ దృష్టిని తమవైపుకు తిప్పుకోవాలని చూస్తున్నారు. గతంలో ఎక్కువగా బాలీవుడ్ బ్యూటీస్ ఆ విధంగా అందరి దృష్టిని ఆకర్షించేవారు. అయితే ఇప్పుడు బుల్లితెర స్టార్స్ కూడా పబ్లిక్ ను ఆకట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అరియానా గ్లోరీ ఓ బుల్లితెర ఈవెంట్‌లో గ్లామరస్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. అయితే అదే ఈవెంట్‌కి హాజరైన మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆశు రెడ్డి ఓ కొంటె పని చేసింది. అరియానా నడుముపై ముద్దు పెట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది.
అదే విషయాన్ని తన సోషల్ మీడియా పేజీలో పంచుకుంటూ మా ప్రేమ స్నేహం అంతులేనిదని, అయితే ద్వేషించే వారు ఎలాగైనా వారిని ద్వేషిస్తారని ఆశు పేర్కొంది.
ఇక ఈ ఫోటో పై నెటిజన్స్ మాత్రం రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది నెగిటివ్ గా కామెంట్స్ చేస్తుంటే మరికొంత మంది కెమిస్ట్రీ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.