కేంద్ర సహాయ మంత్రి అశ్విని చౌబేకు పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లోని వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు గాయపడ్డారు, అందరూ సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వివరాల్లోకెళ్తే.. కేంద్ర సహాయ మంత్రి అశ్విని చౌబే ఆదివారం రాత్రి బక్సర్ నుండి పాట్నాకు వెళుతుండగా, ఆయన కాన్వాయ్‌లో భాగమైన పోలీసు జీపు బోల్తా పడింది. అయితే అక్కడే ఉన్న ప్రజలు వెంటనే రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. మంత్రి తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో వీడియో ఫుటేజీని పోస్ట్ చేశారు.
మంత్రి అశ్విని చౌబే ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ.. ‘బక్సర్ నుండి పాట్నాకు వెళుతుండగా, కోరన్‌సరాయ్ పోలీస్ స్టేషన్ వాహనం దుమ్రావ్ మథిలా-నారాయణపూర్ రహదారిలోని కాలువ వంతెనను ఢీకొట్టింది. శ్రీరాముని దయతో అందరూ బాగున్నారు. గాయపడిన పోలీసులు, డ్రైవర్‌తో కలిసి దుమ్రావ్ సదర్ ఆసుపత్రికి తరలించారు.
బోల్తా పడిన కారులో నుంచి పోలీసులను బయటకు తీసే పనిలో బీజేపీ కార్యకర్తలు అజయ్ తివారీ,తన అంగరక్షకులు నాగేంద్ర కుమార్ చౌబే, మోహిత్ కుమార్, ధనేశ్వర్ కుమార్, కుంజ్‌బిహారీ ఓజా, ఏఎస్‌ఐ జైరాం కుమార్‌లు పాల్గొన్నారని, ముఖేష్ కుమార్, సుజోయ్ కుమార్, ప్రేమ్ కుమార్ సింగ్ ప్రమాదం జరిగిన జీపులో ఉన్నట్టు తెలిపారు.