యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వరుస పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్ సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ వీటితోపాటు నాగ్ అశ్విన్ దర్శకత్వం లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పడుకొనే, అమితాబ్ లు నటిస్తున్నారు. కాగా తాజాగా నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నవంబరు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమవుతుందని అప్పటినుంచి దాదాపు 13 నెలల పాటు రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటుందని తెలిపారు. అలాగే గ్రాఫిక్స్ పనులు కూడా ప్రారంభమయ్యాయి అని అన్నారు.