బీజేపీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఫైర్ అయ్యారు. రామజన్మ భూమి ఉద్యమంలో శివసేన నాయకులు ఒక్కరు కూడా పాల్గొనలేదని మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
రామజన్మభూమి ఉద్యమంలో శివసేన పాత్ర ఏంటో తెలియాలంటే బీజేపీ నాయకులు వారి పార్టీ అగ్రనేతలను అడగాలని ఆయన అన్నారు.
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, చైనా చొరబాటు వంటి సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ, దాని “సోదరి( మహారాష్ట్ర నవనిర్మాణ సేన)లు హనుమాన్ చాలీసా, అయోధ్య పారాయణ సమస్యలను లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్నాయని రౌత్ పేర్కొన్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో శివసేన సైనికులు ఎక్కడ ఉన్నారని ఎవరైనా తెలుసుకోవాలంటే వారు తమ నాయకుడు దివంగత సుందర్ సింగ్ భండారీని అడగాలన్నారు. ఆనాటి సీబీఐ. ఐబీ నివేదికను పరిశీలిస్తే తెలుస్తుందన్నారు.
శివసేన ఎక్కడ అని జ్ఞానం లేకుండా అడిగే వారికి అప్పుడు సమాధానాలు లభిస్తాయన్నారు. పరిస్థితి మారింది, సమస్యలు కూడా మారాయన్నారు. ప్రజలు దానిని పట్టించుకోరన్నారు.