అసోం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య అంతర్ రాష్ట్ర సరిహద్దు వివాదాన్ని వచ్చే ఏడాది నాటికి పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం హామీ ఇచ్చారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఆయన అరుణాచల్ ప్రదేశ్ చేరుకున్నారు. రాష్ట్రం లోని నరోత్తమ్ నగర్ లోని రామకృష్ణ మిషన్ ఆశ్రమాన్ని ఆయన శనివారం సందర్శించారు.
రామకృష్ణ మిషన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు కేంద్ర హోం మంత్రి హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఆశ్రమానికి వెళ్లారు.
రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ) సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్ బీ) సిబ్బందితో సంభాషించనున్నారు.