అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ డ్యాన్సుతో హోరెత్తించారు. ప్రస్తుతం ఆయన పిల్లలతో కలిసి చేసిన డ్యాన్స్ తో కూడిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెట్టింట్లో సీఎంలో ఇంత టాలెంట్ కూడా ఉందా అంటూ నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు. సీఎం అనుకోకుండా పాఠశాలను సందర్శించారు.అక్కడ చదువుకుంటున్న పిల్లలతో చాలా సేపు మాట్లాడారు.
అనంతరం వారి కోరిక మేరకు ఆ పిల్లలతో కలిసి స్టెప్పులతో అదరగొట్టారు. వేదిక పై హల్ చల్ చేశారు హిమంత బిశ్వ శర్మ. టీ కమ్యూనిటీల సాంప్రదాయ జానపద నృత్యమైన ఝుమూర్ ను ప్రదర్శదించారు. అందరిని విస్తు పోయేలా చేశారు.అక్కడికి వచ్చిన వారంతా తమ ముఖ్యమంత్రేనా ఇంత బాగా చేస్తున్నారంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
విచిత్రం ఏమిటంటే స్వయంగా తానే ఈ వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తనకు ప్రత్యేకంగా ఆనందించాల్సిన సాయంతం. బిస్వనాథ్ హటీంగా టీఈ మోడల్ స్కూల్ విద్యార్థులు నా నివాసంలో ఝుమర్ ప్రదర్శిస్తున్న వారితో చేరకుండా ఉండలేకపోయానని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సీఎం హిమంత బిశ్వా శర్మ స్వయంగా ట్విట్టర్ లో పేర్కొనడం ప్రతి ఒక్కరిని విస్తుపోయేలా చేసింది.
ఇదిలా ఉండగా దిస్పూర్ లోని సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హిమంత శర్మ విద్యార్థులను ఉత్సాహ పరుస్తూ స్టెప్పులేశారు.