సర్జికల్ స్ట్రైక్స్ పై సాక్ష్యాలు కావాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అసోం సీఎం హిమాంత బిశ్వ తీవ్రస్థాయలో మండిపడ్డారు. మన వీర సైనికులు నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ కు సాక్ష్యాలు ఇదిగో చూడండి అంటూ ట్విట్టర్ లో ఓ వీడియోను బిశ్వ శర్మ పెట్టారు.
దీనివల్లే కదా మన సైనికుల పరాక్రమాన్ని మీరు ప్రశ్నించారు. వారి త్యాగాలను అవమాన పరిచారు. మన సైనికులపై దుష్పప్రచారం చేసి దాడి చేయడానికి మీరెందుకంత తహతహలాడుతున్నారు అని ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ ను ఆయన ప్రశ్నించారు.
అంతకు ముందు సర్జికల్ స్ట్రైక్ కు సంబంధించిన సాక్ష్యాలను చూపించాలని కేంద్రాన్ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనిపై అసోం సీఎం హిమాంత శర్మ స్పందిస్తూ.. సర్జికల్ స్ట్రైక్స్ కు రాహుల్ గాంధీ సాక్ష్యాధారాలు అడుగుతున్నారని, మీరు రాజీవ్ గాంధీ కొడుకేనా దానికి సాక్ష్యాలు చూపాలని బీజేపీ ఎప్పుడైనా అడిగిందా అంటూ ప్రశ్నించారు.
దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. సర్జికల్ స్ట్రైక్స్ పై రాహుల్ గాంధీ ఆధారాలు అడగడంలో ఎలాంటి తప్పూ లేదన్నారు. తాను ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ పై ఆధారాలు చూపాలని అడుగుతానని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్ ను పొలిటికల్ మైలేజీ కోసమే బీజేపీ వాడుకుంటోందని కేసీఆర్ విమర్శించారు.