సీఎం కేసీఆర్ కు ఆసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ‘ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని తల్లి కామాక్య దేవీ, మహాపురుషుడు శ్రీమంత శంకరదేవ్ లను ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
అంతకు ముందు సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ తెలంగాణ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవునికి ప్రార్థనలు చేస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
ఇటీవల సీఎం కేసీఆర్ కు అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మకు మధ్య విమర్శల యుద్ధం నడిచింది. సర్జికల్ స్ట్రైక్ పై సాక్ష్యాలు చూపాలంటూ డిమాండ్ చేసిన రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు చేసింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి మద్దతుగా కేసీఆర్ నిలిచారు. రాహుల్ గాంధీ మాటల్లో తప్పేముందని, తాను కూడా ఇప్పుడు సాక్ష్యాధారాలు అడుగుతున్నానని అన్నారు.
దీనికి అసోం సీఎం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్… ఇవిగో సక్ష్యాలు చూడండంటూ ఓ వీడియోను శర్మ ట్వీట్ చేశారు. మీరు వీర సైనికుల సాహాసాన్ని అమమానిస్తున్నారు. మన సైన్యాన్ని అపఖ్యాతిపాలు చేసేందుకు మీరెందుకంత తపన పడుతున్నారు. దేశ ప్రజలు ఇదంతా చూస్తున్నారని అన్నారు.