కరోనా వైరస్ రాకుండా ముందస్తు జాగ్రత్తగా యాంటీ మలేరియ డ్రగ్ తీసుకున్న ఓ డాక్టర్ గుండెపోటుతో చనిపోయాడు. అస్సాం రాజధాని గువహటికి చెందిన డాక్టర్ ఉత్పల్ జిత్ బర్మన్ (44) సీనియర్ అనస్తీస్ట్. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో ముందస్తు జాగ్రత్తగా అతను మలేరియా జ్వరానికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ వేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే గుండెపోటుతో మరణించాడు. అతని గుండెపోటుకు ఆ టాబ్లెటే కారణమని ఇంకా నిర్ధారణ కాకపోయినప్పటికీ ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత అదో రకంగా ఉందని తన కొలీగ్స్ కు వాట్సాప్ మెసేజ్ చేశాడు.
కరోనా వైరస్ పేషెంట్లతో పని చేస్తున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, వైరస్ సోకిన వారి కుటుంబ సభ్యులు మలేరియాకు వాడే టాబ్లెట్ వేసుకోవచ్చని ప్రభుత్వ వైద్య సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సూచించింది. డ్రగ్ ను కరోనా వైరస్ కు సొంత వైద్యంగా వాడొద్దని కూడా హెచ్చరించింది. అయితే డాక్టర్ బర్మన్ కరోనా వైరస్ పేషెంట్లతో పని చేయడం లేదు. అస్సాంలో ఇప్పటి ఒక్క కరోనా వైరస్ పేషెంట్ కూడా లేడు. ఆరు రాష్ట్రాల్లో మాత్రం ఇంత వరకు ఒక్క కరోనా పేషెంట్ నమోదు కాలేదు. వాటిలో అస్సాం ఒకటి. కరోనా వైరస్ పై ఆ రాష్ట్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకొని రాష్ట్ర సరిహద్దులు మూసివేసింది. పాజిటివ్ కేసులు నమోదు కాకపోయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు స్క్రీనింగ్, టెస్టింగ్, సర్వీలియెన్స్ పై దృష్టి పెట్టినట్టు ఆ రాష్ట్ర హెల్త్ సెక్రెటరీ సమీర్ సిన్హా తెలిపారు.
చైనా మాత్రం మలేరియాకు ఉపయోగించే క్లరోక్విన్ పాస్పేట్, హైడ్రాక్సీక్లరోక్విన్ లను కరోనా వైరస్ చికిత్స కు ఉపయోగిస్తున్నారు.