ఇండియా శ్రీలంక మధ్య జరగాల్సిన మ్యాచ్ కనీసం టాస్ కూడా పడకుండానే ఆగిపోయింది. వర్షం దెబ్బకు మ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకపోవటంతో ఫాన్స్ నిరాశ చెందారని అంతా భావించినా… ఇక మ్యాచ్ మీద ఆశలు పోవటంతో స్టేడియం మొత్తం ఒకే కంఠంతో వందేమాతరం సాంగ్ ఆలపించింది. వందేమాతరం అంటూ స్టేడియం హోరెత్తటంతో మ్యాచ్ ఆగిపోయిన బాధ కాస్తయినా తీరింది.
నిజానికి వర్షం తగ్గినా గ్రౌండ్ సిబ్బంది చేతగాని తనం, అరకొర సదుపాయాలతో మ్యాచ్ మొదలుకాలేకపోయింది. పిచ్ పూర్తిగా తడిసిపోవటంతో… పిచ్ ఆరబెట్టేందుకు సిబ్బంది నానా తంటాలు పడ్డా ఫలితం లేకుండా పోయింది. దీనిపై ఆటగాళ్లతో పాటు అన్ని వైపుల నుండి విమర్శలు వ్యక్తమయ్యాయి.
అయితే, దేశంలో ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక ఉద్యమంలో అస్సాం ముందుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మ్యాచ్ నిర్వహించాలా, తరలించాలా అన్న మీమాంస కూడా కొనసాగినప్పటికీ, కొన్ని ఆంక్షలతో మ్యాచ్ నిర్వహించారు. కానీ మ్యాచ్ జరగకపోయినా స్టేడియంకు వచ్చిన వారంతా వందేమాతరం పాట ఆలపించటం దేశ సమైక్యతకు అద్దం పడుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Guwahati, you beauty ?#INDvSL pic.twitter.com/QuZAq7i1E3
— BCCI (@BCCI) January 5, 2020
Advertisements