దేశరాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధం మోజులో పడి ఓ మహిళ చేయరాని ఘోరం చేసింది. భర్త,అత్తను చంపి ముక్కలు చేసి పక్కరాష్ట్రంలో విసిరేసింది. ఢిల్లీలోనే నిక్కీ యాదవ్ అనే యువతిని సాహిల్ అనే యువకుడు చంపేసి దాబాలోని ఫ్రిజ్ లో దాచిపెట్టిన ఘటన మరిచిపోకముందే ఈ దారుణ ఉదంతం వెలుగుచూసింది.
గువాహటి సమీపంలోని నున్‌మతిలో వందన కలీట, భర్త అమరేంద్ర డే, అత్త శంకరి డేలతో నివాసం ఉంటోంది. ఐతే పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వందన కలీట ఏడు నెలల క్రితమే ప్రియుడితో కలిసి భర్త, అత్తలను హత్య చేసింది.
అనంతరం వారి శరీర భాగాలను ముక్కలుగా నరికి పాలిథీన్ కవర్లలో ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెట్టింది. కొన్ని రోజుల తర్వాత వాటిని గువాహటికి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే మేఘాలయలోని చిరపుంజికి తన ప్రియుడితో కలిసి వెళ్లి అక్కడి కొండల్లో శరీర భాగాలను విసిరేసింది.
ఎవరికీ అనుమానం రాకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ స్టేషన్‌లో భర్త, అత్త కనిపించడం లేదంటూ గతేడాది సెప్టెంబర్‌లో మిస్సింగ్ కేసు పెట్టింది. ఈ ఘటన గతేడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో జరగింది. ఐతే అమరేంద్ర డే తల్లికి సంబంధించిన కొన్ని శరీర భాగాలను పోలీసులు మేఘాలయాలో స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.