తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశంల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ సస్పెండ్ చేయడంతో.. అసెంబ్లీలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మన ఊరు మన బడి కార్యక్రమానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా స్వీపర్లకు జీతాలు పెంచి వారిని పర్మినెంట్ చేయాలని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. భట్టి అంటే గౌరవం ఉందని.. కానీ ఆయన మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. 60 ఏండ్లు రాజ్యం ఏలింది మీరు.. మీ పార్టీనే కదా..? అని అన్నారు. మన ఊరు..మన బడి కి నిధులు ఇచ్చిన విషయం తెలియదా..? అని వ్యాఖ్యానించారు.
మీ హయాంలో కంటే 10 రేట్ల రెసిడెన్షియల్ స్కూల్ పెంచామని సమాధానం ఇచ్చారు. భట్టి కావాలనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల ప్రకటన రాగానే నియమించడం ఎవరి తరం కాదని.. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు కేటీఆర్.
దీని స్పదించిన భట్టి.. మన ఊరు మన బడి కి ఇచ్చిన నిధులు ఈజేఎస్ నిధులే కదా..? అని ప్రశ్నించారు. ఒక దానికి కేటాయించిన నిధులు.. ఇంకో దానికి బదిలీ చేశారని ఆరోపించారు. జిల్లా, మండల పరిషత్ లకే డబ్బులు లేకుంటే.. వాటి నిధులు పక్క దారి పట్టించుకోవడం ఎందుకు..? అని నిలదీశారు భట్టి.