పాపులర్ జువెల్లరీ చైన్ జాయ్ అలూక్కాస్ పై ఈడీ కొరడా ఝళిపించింది. ఈ సంస్థకు చెందిన అయిదు కంపెనీలపై దాడులు నిర్వహించి రూ. 305.84 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. విదేశీమారక ద్రవ్య సంబంధ చట్టంలోని నిబంధనలను జాయ్ అలూక్కాస్ అతిక్రమించినట్టు తేలడంతో ఈ చర్య తీసుకుంది. హవాలా మార్గం ద్వారా ఇండియా నుంచి దుబాయ్ కి భారీ మొత్తంలో నగదును బదిలీ చేసి ఆ తరువాత 100 శాతం దుబాయ్ లోని ఎల్ఎల్సి జాయ్ అలూక్కాస్ జువెల్లరీ లో పెట్టుబడులుగా పెట్టిందని ఈడీ ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైంది.
సంస్థ పూర్తిగా జాయ్ అలూక్కాస్ వర్గీస్ యాజమాన్యంలో ఉంది. తమ రూ. 2,300 కోట్ల ‘ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్’..ఐపీఓ ను ఉపసంహరించుకుంటున్నామని, తమ ఆర్ధిక సంబంధ ఫలితాల లెక్కల్లో మార్పులను చేసేందుకు తమకు మరికొంత వ్యవధి కావాలని ఈ సంస్థ కోరింది. ఈడీ అటాచ్ చేసుకున్న ఆస్తుల్లో 33 స్థిరాస్థులు ఉన్నాయి.
రూ. 81.54 కోట్ల విలువైన భూమి,కేరళ .. త్రిసూర్ లోని శోభా సిటీలో ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఈడీ వశమయ్యాయి. ఇంకా రూ. 91.22 లక్షల విలువైన మూడు బ్యాంక్ అకౌంట్లు, 5.58 కోట్ల విలువైన మూడు ఫిక్స్డ్ డిపాజిట్లు, 217.81 కోట్ల విలువైన జాయ్ అలుకాస్ షేర్లను ఈడీ సీజ్ చేసింది. మార్కెట్ కండిషన్లను బట్టి సాధ్యమైనంత త్వరగా తమ ఐపీఓ డాక్యుమెంట్లను తిరిగి ఫైల్ చేసుకోవాలనే యోచనలో ఉన్నట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ బేబీ జార్జ్ తెలిపారు.
దేశంలోనే రెండో అతి పెద్ద ఆభరణాల షో రూమ్ అయిన జాయ్ అలుక్కాస్ కి దేశ వ్యాప్తంగా 68 శాఖలున్నాయి.ఇండియాలో .. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఇది బాగా పాపులర్ అయింది. అయితే 25 ఎకరాల్లో నిర్మించబోయే ప్రాజెక్టు కోసం దుబాయ్ కి హవాలా మార్గంలో రూ. 305 కోట్లకు పైగా నిధులను మళ్లించినట్టు ఈ సంస్థపై ఆరోపణలు వచ్చాయి. దీంతో కేరళ లోని ఈ సంస్థ కార్యాలయంతో సహా దీని వివిధ శాఖల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
‘..