ఓ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోంది. గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అయితే దీని వల్ల ప్రమాదం ఏమీ ఉండదని అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి సమీపంలోకి వచ్చి వెళ్తుందని చెబుతున్నారు.
2016 ఏజే 193 అనే గ్రహశకలం ఇవాళ రాత్రి 8.40 గంటల సమయంలో భూమికి అత్యంత దగ్గరగా రానుందని నాసా ప్రకటించింది. భూ కక్ష్యలో పయణిస్తున్న ఆ గ్రహశకలం మళ్లీ 2063లో దగ్గరగా వస్తుందని వెల్లడించింది.
ఈ శకలం 4500 అడుగుల వెడల్పు ఉన్నట్లు చెబుతున్నారు సైంటిస్టులు. 2016లో హవాయ్ లోని పాన్ స్టార్స్ అబ్జర్వేటరీ సాయంతో దీన్ని గుర్తించామన్నారు.