అంతరిక్షంలోని గ్రహశకలాలు భూమిపైకి దూసుకొచ్చినప్పుడు కొన్ని సార్లు ప్రమాదం జరిగాయి. అయితే.. అలాంటి మరో ప్రమాదం రాబోతోంది. ఒక గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది. ఇది 450 మీటర్ల వెడల్పు ఉన్నప్పటికీ.. మిగతా గ్రహశకలాలతో పోలిస్తే ఇది అంత భయపడాల్సింది కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.\\
కానీ.. ఇది ప్రయాణించే వేగం ప్రమాదకరంగా ఉందంటున్నారు. గంటకు 49,513 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోందని తెల్చి చెప్పారు. ఇది గనుక భూమిపై పడితే చాలా నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు.
తాజాగా.. పొటెన్షియల్లీ హజార్డస్ గ్రహశకలాల జాబితాలో నాసా చేర్చింది. ఆస్టరాయిడ్ 2013బీవో76 అని పిలిచే ఇది.. ఈసారి భూమికి 51 ,11,759 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోతుందని అంటున్నారు. కానీ.. భూమిపై ఎటువంటి ప్రభావమూ చూపబోదని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ రోజే ఆ గ్రహశకలం భూమిని దాటేస్తుందనే అంచనాకు వస్తున్నారు.
గ్రహశకలం భూమి సమీపంలోకి రావడం ఇది తొలిసారేం కాదట. 2013లో భూమి వైపు దూసుకొచ్చిన ఈ ఆస్టరాయిడ్.. అప్పుడు 78,88,295 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోగా.. ఈసారి మాత్రం మరింత దగ్గరగా వస్తోందని అంటున్నారు. ఇదిలా ఉంటే 2033 జులై 14న మరోసారి ఇది భూమి దగ్గరకు వస్తుందనే అంచనాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు.