ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ-అస్ట్రాజెనికా కంపెనీలు సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్. భారత్ లో సీరమ్ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. భారత్ లో ఈ నెల 16 నుండి అత్యవసర వ్యాక్సినేషన్ కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కోవిషీల్డ్ డోసులు రాష్ట్రాలకు చేరుతున్నాయి.
అయితే, ఈ వ్యాక్సిన్ రెండు డోసుల ధర బహిరంగ మార్కెట్ లో 1000రూపాయలు ఉంటుందని సీరం సీఈవో ఆధార్ పునావాలా ప్రకటించారు. అయితే, భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మొదటి 10కోట్ల డోసులను కేవలం 200రూపాయలకే ప్రభుత్వానికి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. భారత్ లోని పేద వర్గాలకు సహాయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
వ్యాక్సిన్ కోసం చాలా దేశాలు తమను సంప్రదిస్తున్నాయని, ఆఫ్రికా సహా ఇతర దేశాలకు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు.